Gun Miss Fires in Bhadradri : తుపాకీ మిస్‌ఫైర్.. హెడ్‌కానిస్టేబుల్ మృతి - constable died as Gun Miss Fires in bhadradri
08:39 February 12
తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో హెడ్‌కానిస్టేబుల్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాచనపల్లి పోలీస్‌స్టేషన్‌లో విషాదం చోటుచేసుకుంది. తుపాకీ మిస్‌ఫైర్ అయి హెడ్‌కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఆయుధాలు పరిశీలిస్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
మృతుడు సంతోశ్ వరంగల్ జిల్లా గవిచర్ల వాసి అని వెల్లడించారు. ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు మృతదేహాన్ని తరలించారు. 3 రోజుల క్రితమే సంతోశ్‌కు కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధం చూశారు. త్వరలో ఓ ఇంటివాడవుతాడు అనగా.. మృతిచెందడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.