తెలంగాణ

telangana

ETV Bharat / crime

Constable Rape Attempt on Girl : కాపాడాల్సిన పోలీసే.. కాటేయబోయాడు! - Constable Rape Attempt on Girl in Nellore

Constable Rape Attempt on Girl : ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఓ బాలికపై హెడ్​కానిస్టేబుల్​ అత్యాచారయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Constable Raped a Girl
Constable Raped a Girl

By

Published : Dec 28, 2021, 11:50 AM IST

Constable Rape Attempt on Girl : నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కష్టమొస్తే కాపాడాల్సి పోలీసే.. ఓ బాలికపై అత్యాచారం చేయబోయాడు. జిల్లాలోని చిట్టమురు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై హెడ్​కానిస్టేబుల్ అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. హెడ్‌కానిస్టేబుల్‌ సుధాకర్‌.. ఓ కేసు విషయంలో ఓ కుటుంబాన్ని ఇంటికి రమ్మని పిలిచాడు. తల్లిదండ్రులతో పాటు బాలిక కూడా అక్కడికి వెళ్లింది.

Constable Rape Attempt on Girl in AP : ఎవరూ లేని సమయంలో సుధాకర్ ఇంటికి వెళ్లిన బాలికపై అత్యాచారం చేయబోయాడు. భయపడి తల్లిదండ్రులను వెతుక్కుంటూ పరిగెత్తిన బాలిక.. విషయాన్ని వారికి వివరించింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు హెడ్​కానిస్టేబుల్ సుధాకర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details