ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన ఆంజనేయులు వయసు.. 7 పదుల పైనే ఉంటుంది. ఈ వయసులో.. సంపాదించింది అనుభవిస్తూ ప్రశాంతంగా జీవితాన్ని గడిపేందుకు అలాంటి వృద్ధులు ప్రాధాన్యత ఇస్తుంటారు కానీ ఈయన మాత్రం తన రూటే సెపరేటూ అన్నట్టుగా ప్రవర్తించారు. తన ఇంటి ఆవరణలోనే ఏకంగా 40 గంజాయి(GANJA) మొక్కలు సాగు చేశారు. ఆ నోటా.. ఈ నోటా ఈ విషయం పోలీసుల వరకూ వెళ్లింది.
OLD MAN GANJA CASE: వృద్ధుడే.. కానీ ఆయన చేసే పని తెలిస్తే షాక్ అవుతారు! - telangana news
డెబ్బై ఏళ్ల వృద్ధులు చాలా వరకు ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగిస్తుంటారు. కానీ.. ఈయన మాత్రం అలా కాదు. తన ఇంటి ఆవరణలో ఓ ఘనకార్యానికి ఒడిగట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సైతం ఈ వయసులో ఇదేం పని తాతా.. అన్నట్టుగా షాక్ తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఎవరా తాత? ఎక్కడి వ్యక్తి ఆయన? ఏం చేశారంటే..!
ఇంట్లో గంజాయి సాగు, గంజాయి సాగు చేస్తున్న వృద్ధుడు
పక్కా సమాచారం సేకరించిన పోలీసులు.. ఆయన ఇంటికి వెళ్లి వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఆ గంజాయి మొక్కలను పరిశీలించారు. వెంటనే వాటిని తొలగించిన పోలీసులు.. మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. ఇంట్లో ఉన్న దాదాపు కిలో గంజాయిని సీజ్ చేశారు. వృద్దుడిపై కేసు నమోదు చేశారు. సెబ్ సి.ఐ మారుతి రావు, సిఐ శేఖర్, సిబ్బందితో దాడులు నిర్వహించారు.
ఇదీ చదవండి:Miserable condition: ఓవైపు పురిటి నొప్పులు.. మరోవైపు పొంగుతున్న వాగు!