హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలోని హెచ్సీయూ (HYDERABAD CENTRAL UNIVERSITY)లో విషాదం నెలకొంది. పీహెడ్డీ విద్యార్థి శివరమాచంద్రన్ ఆత్మహత్యకు యత్నించాడు.
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన శివ.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ- తెలుగు మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇవాళ మధ్యాహ్నం వసతిగృహంలోని తన గదిలో విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన తోటి విద్యార్థులు.. వెంటనే ఆస్పత్రికి తరలించారు.