తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని హయత్ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు కొహెడలోని బాహ్యవలయ రహదారి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టగా... కారులో, ఆటోలో మద్యం తరలిస్తున్నట్లు బయటపడింది. రమావత్ దామోదర్, హరి అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
ఆంధ్రాకు అక్రమ మద్యం.. పోలీసుల స్వాధీనం - hyderabad district news
తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను హయత్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 600 మద్యం బాటిళ్లు, కారు, ఆటో స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రాకు అక్రమ మద్యం.. పోలీసుల స్వాధీనం
నిందితుల నుంచి 600 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఏపీతో పోలిస్తే తెలంగాణలో మద్యం ధరలు తక్కువగా ఉండటంతో... ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఇదీ చదవండి:నల్లపోచమ్మ ఆలయంలో చోరీ.. హుండీని ధ్వంసం చేసిన దుండగులు