HAWALA MONEY SIEDE: హైదరాబాద్‌లో మరోసారి హవాలా డబ్బు పట్టుబడింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో 70 లక్షల రూపాయల హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణ ద్వారకాపురి కాలనీలో తనిఖీలు నిర్వహించారు. వెంటనే పోలీసులను తప్పించుకుంటూ ఓ కారు ఆగకుండా చెక్‌పాయింట్ దాటి వెళ్లిపోయింది. అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు కారును వెంబడించారు.
కొంత దూరం వెళ్లిన తరవాత కారును ఆపిన పోలీసులు తనిఖీ చేయగా.. నోట్ల కట్టలు ఉన్న బ్యాగు దొరికింది. ఆ బ్యాగులో 70లక్షల రూపాయలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డబ్బులకు సంబంధించి ఎలాంటి రశీదు లేదని చెప్పారు. ఈ డబ్బుకు సంబంధించి పట్టుబడిన వ్యక్తులు ఎటువంటి పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.