తెలంగాణ

telangana

ETV Bharat / crime

MRO Audio Viral : 'ఎవరు లంచం ఇస్తే వాళ్లకు భూమి రిజిస్ట్రేషన్ చేస్తాం!' - హవేలి ఘనపూర్​ తహసీల్దార్ ఆడియో వైరల్

MRO Audio Viral : మెదక్ జిల్లా హవేలి ఘనపూర్​ తహసీల్దార్​గా పని చేసి బదిలీపై వెళ్లిన అతనితో.. ఓ యువకుడు జరిపిన సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఎవరు ఎక్కువ లంచం ఇస్తే వాళ్ల పేరిట భూమి రిజిస్ట్రేషన్ చేస్తామంటూ ఆ తహసీల్దార్ అన్న మాటలు దుమారం రేపాయి. వారిద్దరి సంభాషణ ఎలా సాగిందంటే..?

MRO Audio Viral
MRO Audio Viral

By

Published : Jan 11, 2022, 8:28 AM IST

MRO Audio Viral : ‘మీకు లంచం ఎవరిస్తే వాళ్లకు భూమి రిజిస్ట్రేషన్‌ చేస్తారు కదా?’ అని ఓ యువకుడు ప్రశ్నించగా.. ‘అంతే అంతే’ అంటూ ఓ తహసీల్దార్‌ ఫోన్‌ సంభాషణలో చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో సోమవారం వైరల్‌గా మారాయి. మెదక్‌ జిల్లా హవేలి ఘనపూర్‌ తహసీల్దార్‌గా పనిచేసి గత శనివారం బదిలీపై వెళ్లిన దశరథ్‌తో మండలంలోని పోచమ్మరాల్‌కు చెందిన ఓ యువకుడు గ్రామంలో అక్రమ రిజిస్ట్రేషన్‌ జరిగిందంటూ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ సంభాషణ చోటుచేసుకుంది.

Haveli Ghanpur MRO Audio Viral : యువకుడు:పోచమ్మరాల్‌ గ్రామంలో ఈ నెల 6న పీర్యా పేరిట ఉన్న భూములను కొందరు రైతులు తమ పేరిట మార్చుకున్నారు. అసలు ఆ పీర్యా పేరిట భూమే లేదు. ఆయన భార్య డిప్యూటీ తహసీల్దారు అయినంత మాత్రాన అతడి పేరిట భూమి ఎలా వచ్చింది? గుంటకు రూ.1500 లంచం తీసుకొని రిజిస్ట్రేషన్‌ చేయడం ఎంతవరకు కరెక్ట్‌ సార్‌?

తహసీల్దారు:రూ.1500 నాకిచ్చిండ్రా?

యువకుడు:మీక్కాదు సార్‌, ఇక్కడ సాక్షులు ఉన్నారు. ఎవరెవరు ఎంతెంత ఇచ్చిండ్రో చెబుతున్నారు. అందులో ఎంతమంది పట్టా చేయించుకున్నారో మొత్తం తీపించిన. ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు చేస్తా. (ఇలా అంటుండగానే..)

తహసీల్దారు:సీఎంకు ఇవ్వు.. జర మంచిగుంటది. ఇక ఎవరు చేయరిక ఇట్ల.. (వ్యంగ్యంగా)

యువకుడు:మీరు లంచం ఎవరిస్తే వాళ్లకు భూమి రిజిస్ట్రేషన్‌ చేస్తారు.. ఎవరు ఎక్కువ ఇస్తే వారి మీదకు మారుస్తారు కదా?

తహసీల్దారు: అంతే అంతే నువ్విస్తే నీ పేరిటకు మారుస్తం.. అంటూ సంభాషణ సాగింది.

దీనిపై తహసీల్దారు దశరథ్‌ను వివరణ కోరగా పొరపాటు జరిగిందని, పనిలో బిజీగా ఉండి అలా మాట్లాడానని చెప్పుకొచ్చారు.

ABOUT THE AUTHOR

...view details