Haryana Baba Gang who stole lakhs for doing pujas: జీవితం అంటే కష్టాలు ఉంటాయి.. సుఖాలు ఉంటాయి అంత మాత్రానా ఇంకా ఏదో కావాలని ఆశించిన వారికి ఇటువంటి చేదు అనుభవాలే ఎదురవుతాయి. జీవితం మంచిగా ఉండేందుకు, సమస్యలు తీరేందుకు పూజలు చేస్తానని నగరానికి చెందిన ఓ మహిళను హర్యానా బాబా గ్యాంగ్ బురిడీ కొట్టించింది. సమస్యలు తీరేందుకు పూజలు చేయించుకునేందుకు బేగంపేటకు చెందిన మహిళ గూగూల్లో ఆస్ట్రాలజర్ కోసం వెతికారు. వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేయగా హర్యానాకు చెందిన ఓ బాబా ఆమెకు ఫోన్ చేశాడు. ఆమె సమస్యలు విన్న బురిడీ బాబా...పలు వివరాలు అడిగి తెలిసుకున్నాడు.
ఆన్లైన్లో పూజలు జరిపిస్తున్నారా.. అయితే ఈ విషయం తెలిస్తే మరి ఆ పని చేయరు.. - హర్యానా బాబా గ్యాంగ్
Haryana Baba Gang who stole lakhs for doing pujas: మీ ఇంట్లో ఎటువంటి కష్టాలు ఉన్న ఈ పూజ చేయండి మీ బాధలు అన్ని పటాపంచలు చేస్తామని చెబుతారు. అటువంటి వారి వలలో ఎంతో మంది అమాయకులు బలైపోతున్నారు. బాధితుల బలహీనతలనే వారు ఆయుధంగా చేసుకుంటారు. మంత్ర తంత్రాలు, క్షుద్రపూజలతో మోసం చేసేందుకు పకడ్బందీ వ్యూహాలు అమలు చేస్తారు. మోసపోయేందుకు సిద్ధంగా ఉన్నవారిని గుర్తించి బంపరాఫర్ ఇస్తామంటారు. తీరా మోసపోయాక లబోదిబో మంటూ ఉంటారు. అసలేం జరిగింది..
మోసం
పూజల కోసం విడతల వారీగా అమె నుంచి రూ. 47 లక్షలు వసూలు చేశాడు. ప్రతి పూజకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఆమెకు వాట్సాప్ లో పంపాడు. కొన్ని రోజుల తర్వాత వాట్సాప్ నంబర్ బ్లాక్ అవ్వడం, ఫోన్కు కూడా స్పందించలేదు. దీంతో బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: