Love Harassment: బాలికను ప్రేమించమని వెంటపడిన యువకుడిని చితకబాదిన ఘటన హనుమకొండ జిల్లాలోని కాజీపేటలో చోటుచేసుకుంది. ధర్మసాగర్ మండలం ధర్మపురం గ్రామానికి చెందిన ప్రసాద్.. కాజీపేటకు చెందిన బాలికను ప్రేమించమని కొన్ని రోజులుగా వెంటపడుతున్నాడు. బాలిక కుటుంబసభ్యులు మందలించినా అతను మారలేదు.
ప్రేమపేరుతో బాలికకు వేధింపులు.. ఆమె తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసిన యువకుని తండ్రి - యువకుడిని దారుణంగా కొట్టిన ఘటన
Love Harassment: ఓ యువకుడు బాలికను ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా ఆమె ఇంటికి వెళ్లి.. బయటకు రావాలని బెదిరించాడు. దీంతో ఆగ్రహించిన బాలిక కుటుంబసభ్యులు అతనిని తీవ్రంగా కొట్టారు. తర్వాత ఏమైందంటే..

శుక్రవారం బాలిక ఇంటివద్దకు వచ్చిన యువకుడు.. బాలికను బయటికి రావాలని బెదిరించాడు. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ప్రసాద్‌ను తీవ్రంగా కొట్టారు. బాలిక ఫిర్యాదు మేరకు కాజీపేట పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న యువకుని తండ్రి పోలీసు స్టేషన్‌కు వచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా చట్టాన్ని చేతిలోకి తీసుకొని... తన కుమారుడిని కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయపడిన అతనిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి:Sexual harassment in AP : మతం ముసుగులో లైంగిక వేధింపులు