Tragedy in Two Families : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండకు చెందిన యువతి మోకెనపల్లి త్రిష గంగాధరలో ఇంటర్మీడియట్ చదువుతోంది. ఇదే గ్రామానికి చెందిన కొరెపు సతీశ్ కొంతకాలంగా ప్రేమించాలంటూ తమ అమ్మాయిని వేధింపులకు గురిచేస్తున్నట్లు పలుమార్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ప్రవర్తన మార్చుకోని సతీశ్ వారి ఇంటికి వెళ్లాడు. తననే ప్రేమించి పెళ్లి చేసుకోవాలని, లేదంటే చచ్చిపో అంటూ పురుగుల మందు డబ్బా ఇచ్చి వెళ్లిపోయాడు. మనస్తాపానికి గురైన త్రిష.. పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది.
మహబూబాబాద్ జిల్లాలో ఇదే తరహా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం యానంబైలుకు చెందిన బొప్పిశెట్టి సుజాత-నర్సింహారావు దంపతుల కుమార్తె సాయికీర్తి ఖమ్మంలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో పాల్వంచకు చెందిన ఆటోడ్రైవర్ రోహిత్ వేధిస్తుండటంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు.. యువతిను ఖమ్మంలోని ఓ వసతి గృహంలో ఉంచి చదివిస్తున్నారు. అక్కడ తరుణ్ అనే మరో యువకుడు సాయికీర్తిని వేధించసాగాడు. చేసేది లేక అమ్మాయిని డోర్నకల్ మండలం తహసీల్దార్ బంజరలోని అమ్మమ్మ వద్దకు పంపించారు. అక్కడి నుంచి సాయికీర్తి రోజు ఖమ్మంలోని కళాశాలకు వెళ్లి వస్తుండేది.