Youth doing stunts on bike arrested: బైక్పై విన్యాసాలు చేస్తూ.. తోటి వాహనదారులపై అసభ్య పదజాలంతో కామెట్ చేస్తున్న ముగ్గురు యువకులను హనుమకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వివరాలు ప్రకారం హనుమకొండ జిల్లాలోని చింతగట్టు నుంచి భీమారం ప్రధాన రహదారిలో ముగ్గురు యువకులు బైక్పై విన్యాసాలు చేస్తూ.. తోటి వాహనదారులను అసభ్య పదజాలంతో కామెంట్స్ చేస్తూ భయ బ్రాంతులకు గురి చేస్తున్నారు.
ఇది గమనించిన తోటి వాహనదారుడు ఒకరు వారి వికృత చేష్టలను ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో పెట్టాడు. దీనిని చూసిన కాకతీయ యూనివర్సిటీ పోలీసులు స్పందించారు. సీఐ దయాకర్ నేతృత్వంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ముగ్గురు యువకులను గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని ట్రాఫిక్ నియమాలు అనుసరించి వారిపై కేసులు పెట్టారు.