గత 15 ఏళ్లుగా రమేశ్ చేనేత పని చేస్తున్నాడు. సొంత పెట్టుబడి లేని నీరుపేద కావడం వల్ల మాస్టర్ వీవర్ల వద్ద కూలీకి పని చేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. తండ్రి 12 ఏళ్ల క్రితం మరణించాడు. కుటుంబ భారమంతా ఇతనిపైనే ఉంది. తన తల్లి సైతం కూలీకి మగ్గం నేస్తూ ఆసరాగా ఉంటుంది.
బతుకు భారమై.. చేనేత కార్మికుడు ఆత్మహత్య
చేతినిండా పని దొరకగా కుటుంబాన్ని పోషించే శక్తి లేక.. ఆర్థిక ఇబ్బందులతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన చేనేత కార్మికుడు గోశీక రమేశ్(36) ఆత్మహత్య చేసుకున్నాడు. అసలేం జరిగిందంటే?
కరోనా సమయంలో లాక్డౌన్ విధించడంతో కొన్ని నెలల పాటు.. మగ్గాలు మూలపడి పని దొరకలేదు. దీనితో వారు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఆ స్థితి నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోవడంతో మనస్తాపం చెందిన రమేశ్... రంగుల అద్దకానికి ఉపయోగించే నైట్రెట్ రసాయనాన్ని తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
గమనించిన తల్లి ఇరుగుపొరుగు వారి సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతోన్న రమేశ్‌లాంటి చేనేత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.