Head master punishment: ప్రధానోపాధ్యాయురాలు కొట్టిన దెబ్బలకు ఓ విద్యార్థిని చేతి ఎముక చిట్లింది. ఈ ఘటన ఏపీ గుంటూరు జిల్లా చీకటిగలపాలెం ఆదర్శ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థిని అల్లరి చేస్తోందంటూ ఆమె తల్లిని ప్రధానోపాధ్యాయురాలు బుధవారం పాఠశాలకు పిలిపించారు. తరగతిలో అసభ్యంగా మాట్లాడుతూ... అల్లరి చేస్తోందని తల్లి ముందే విద్యార్థినిని ప్రధానోపాధ్యాయురాలు కొట్టారు. అప్పుడు ఆ బాలిక తన చేతులను అడ్డుపెట్టుకుంది. ఈ క్రమంలో చేయి, కాలిపై వాతలు పడ్డాయి.
Head master punishment: తల్లిముందే స్టూడెంట్ను చితకబాదిన ప్రధానోపాధ్యాయురాలు - headmaster fire on Student
Head master punishment: విద్యార్థిని ప్రవర్తన బాగోలేదని... ప్రధానోపాధ్యాయురాలు కర్రతో కొట్టి గాయపరిచిన ఘటన ఏపీ గుంటూరు జిల్లా వినుకొండ మండలం చీకటిగలపాలెం ఆదర్శ పాఠశాలలో జరిగింది. ఆరవ తరగతి చదువుతున్న షబులం సాదియా అనే విద్యార్థిని అల్లరి చేస్తూ.. చెడు మాటలు మాట్లాడుతోందని పాఠశాల హెచ్‌ఎం విజయలక్ష్మి కర్రతో కొట్టినట్లు విద్యార్థిని తల్లి నగీనా ఆరోపించారు.
ఆ తర్వాత కుమార్తెను తల్లి ఇంటికి తీసుకెళ్లారు. కుడిచేయి విపరీతంగా నొప్పిగా ఉందని చెప్పగా ఆసుపత్రిలో చేర్పించారు. విద్యార్థిని చేతి ఎముక చిట్లినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. తన కుమార్తెను కర్రతో కొట్టారని తల్లి ఆరోపించారు. ఈ విషయమై ప్రధానోపాధ్యాయురాలి వివరణ కోరగా.. తరగతిలో ఇద్దరు బాలికల ప్రవర్తన సరిగా లేదంటూ మిగిలిన విదార్థినులు తెలపడంతో గతంలోనే మందలించానని చెప్పారు. అయినా మార్పు రాకపోవడంతో ఒకరి తల్లిని పిలిపించి.. ఆమె ముందే విద్యార్థినిని చేతితో రెండు దెబ్బలు కొట్టానని, అయితే కర్రను వాడలేదని చెప్పారు. అనంతరం వారు ఇంటికి వెళ్లారని, ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని వివరించారు.
ఇవీ చూడండి: