టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో రూ.18,130 విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో నారాయణపేట జిల్లా మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జక్లేర్ గ్రామంలోని ఓ దుకాణంలో నిల్వ ఉంచిన గుట్కాని సీజ్ చేశారు.
జక్లేర్లో నిషేధిత గుట్కా పట్టివేత!
నారాయణపేట జిల్లా జక్లేర్ గ్రామంలో నిషేధిత గుట్కాని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో తనిఖీలు చేసినట్లు తెలిపారు. గుట్కా విక్రయిస్తున్న దుకాణ యజమానిపై కేసు నమోదు చేశారు.
జక్లేర్లో నిషేధిత గుట్కా పట్టివేత!
దుకాణ యజమాని రవిపై కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాములు తెలిపారు.
ఇదీ చదవండి:పరిశుభ్రతా స్కోర్లో అగ్రస్థానంలో నిలిచిన వరంగల్ రూరల్