తెలంగాణ

telangana

ETV Bharat / crime

గురుకుల విద్యార్థి ఆత్మహత్యాయత్నం... కారణం అదేనా.? - పాఠశాలకు అనుమతించట్లేదని విద్యార్థి ఆత్మహత్యాయత్నం

Student Suicide Attempt: పాఠశాలకు అనుమతించడం లేదని ఓ గురుకుల విద్యార్థి మనోవేదనకు గురయ్యాడు. దాంతో పెట్రోల్ పోసుకుని గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగింది.

gurukul student suicide attempt
gurukul student suicide attempt

By

Published : Apr 29, 2022, 4:49 PM IST

Student Suicide Attempt: మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల మండల పరధిలో ఉన్న బాలనగర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు అనుమతించడం లేదని మానసిక ఒత్తిడితో గురువారం పెట్రోల్ పోసుకున్నాడు. జడ్చర్ల మండల పరిధిలోని పోచమ్మ గడ్డ తండా సమీపంలో ఉన్న బాలనగర్ బాలుర గురుకుల పాఠశాలలో హరిచంద్ర ప్రసాద్ అనే విద్యార్థి 9వ తరగతి చదువుతున్నాడు.

ఈ నెల 2న అనుమతి లేకుండా పాఠశాల నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన 5 రోజుల తర్వాత విద్యార్థిని తిరిగి తీసుకురాగా పై అధికారుల సూచనతో చేర్చుకుంటామని ప్రిన్సిపల్ అన్నారు. అదే విధంగా రోజూ ఇంటి నుంచి వచ్చి పరీక్షలు రాయాల్సిందిగా సూచించారు. ఈ క్రమంలో గురువారం పాఠశాలలో విద్యార్థి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని.. వెంటనే బట్టలు మార్చి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసినట్టు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీధర్ రావు పేర్కొన్నారు.

'ఉగాది పండుగకి పంపించమని ప్రిన్సిపల్​ని అడిగాను పంపించలేదు. తర్వాతి రోజు బాబు పర్మిషన్ లేకుండా వచ్చిండు. ఆ తర్వాత కొన్ని రోజులకి నేను వెళ్లి జాయిన్ చేసుకోండి అని అడిగాను. ఎంత బతిమిలాడినా చేర్చుకోలేదు. టీసీ ఇస్తాం కానీ జాయిన్ చేసుకోం అన్నారు. పరీక్షలకు అనుమతి ఇస్తాం.. రోజు ఇంటి నుంచి తీసుకురండి అన్నారు. నిన్న కూడా రోజులాగే తీసుకుపోయి వదిలేశాను.'-విద్యార్థి తల్లి

ఇదీ చదవండి:బ్లేడ్​తో విద్యార్థి గొంతుకోసిన తోటి విద్యార్థి

ABOUT THE AUTHOR

...view details