తెలంగాణ

telangana

ETV Bharat / crime

ప్రవీణ్​రావు కిడ్నాప్​ కేసు: బోయిన్​పల్లి పీఎస్​కు గుంటూరు శ్రీను హాజరు - Praveen Rao kidnapping case details

ప్రవీణ్​రావు కిడ్నాప్​ కేసులో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన గుంటూరు శ్రీను బోయిన్​పల్లి పీఎస్​లో హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించిన ప్రధాన నిందితులతో పాటు.. మరో 14 మందికి న్యాయస్థానం ఆదేశాల మేరకు పీఎస్​కు హాజరై సంతకాలు చేసి వెళ్తున్నారు.

ప్రవీణ్​రావు కిడ్నాప్​ కేసు: బోయిన్​పల్లి పీఎస్​కు గుంటూరు శ్రీను హాజరు
ప్రవీణ్​రావు కిడ్నాప్​ కేసు: బోయిన్​పల్లి పీఎస్​కు గుంటూరు శ్రీను హాజరు

By

Published : Apr 11, 2021, 2:54 AM IST

ప్రవీణ్ రావు అతని సోదరుల అపహరణ కేసులో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన గుంటూరు శ్రీను న్యాయస్థానం ఆదేశాల మేరకు బోయిన్‌పల్లి ఠాణాలో హాజరయ్యాడు . గుంటూరు శ్రీను పోలీసులకు చిక్కకుండా తప్పించుకుతిరుగుతున్నాడు. ప్రధాన నిందితులైన మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్, తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డిలకు కొద్దిరోజుల క్రితం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

20 వేల పూచీకత్తుతో పాటు పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరుకావాలని నిర్దేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు నిందితుడు న్యాయస్థానంలో లొంగిపోయాడని ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో హాజరయ్యాడని ఇన్ స్పెక్టర్ తెలిపారు

ABOUT THE AUTHOR

...view details