పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు ఎస్బీఐ బ్యాంకు దొంగతనం కేసులో నలుగురు నిందితులను మంథని కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. అనంతరం వీరిని మహారాష్ట్రలోని చంద్రాపుర్ జైలుకు తరలించారు. మిగిలిన ముగ్గురు దొంగలను త్వరలోనే పట్టుకుంటామని రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు.
ఈ ఏడాది మార్చి 21న రాత్రి కొంతమంది దుండగులు బ్యాంకు వెనుక భాగం నుంచి కిటికీ గ్రిల్స్‌ను తొలగించి, గ్యాస్ సిలిండర్, కట్టర్ సహాయంతో సేఫ్టీ లాకర్‌ను కట్ చేశారు. సుమారు 6 కిలోల బంగారం, రూ. 18 లక్షల నగదు దొంగిలించారు. ఎట్టకేలకు నలుగురు దొంగలు పట్టుబడగా వారి వద్ద నుంచి మహారాష్ట్ర పోలీసులు 2.9 కిలోల బంగారాన్ని రికవరీ చేసుకున్నారు. ఆ రికవరీలో 70 శాతం బంగారం గుంజపడుగు ఎస్బీఐ బ్యాంకు లోనిదే.