Gun miss fire hunter dead in nizamabad: నిజామాబాద్ జిల్లాలో నాటు తుపాకీ పేలిన ఘటనలో ఓ వేటగాడు ప్రాణాలు కోల్పోయాడు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమరిపేటకు చెందిన బానోత్ రావోజీ, రామిరెడ్డి, ఆశిరెడ్డిలు వన్యప్రాణులను వేటాడేందుకు వెళ్లారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తుంపల్లి అటవీ ప్రాంతానికి వెళ్లిన ఈ ముగ్గురు నిన్న రాత్రి ఓ చెట్టుపైకి ఎక్కి వన్యప్రాణుల కోసం ఎదురుచూస్తున్నారు.
నాటు తుపాకీ పేలి వేటగాడు మృతి - నిజామాబాద్ తాజా వార్తలు
Gun miss fire hunter dead in nizamabad: ఎవడు తవ్వుకున్న గోతిలో వాడే పడతాడు అనే సామెత ఉంది. కొన్ని ఘటనలను చూస్తే అవిధంగా నిజంగానే జరిగినట్లు అనిపిస్తుంది. ఓవ్యక్తి వన్యప్రాణులను వేటాడానికి వెళ్లి అనుకోకుండా నాటు తుపాకీ పేలి తన ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
నాటు తుపాకీ
అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో బానోత్ రావోజీ చెట్టుమీద నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వెంట తెచ్చుకున్న తుపాకీ పేలి.... అందులో ఉన్న తూటా రావోజీ ఛాతిలోకి దూసుకెళ్లింది. చెట్టుపై నుంచి కిందపడిపోయిన రావోజీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన ఇద్దరి ద్వారా సమాచారం తెలుసుకున్న మృతుడు కుటుంబసభ్యులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనపై కామారెడ్డి, నిజామాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇవీ చదవండి: