తెలంగాణ

telangana

ETV Bharat / crime

పల్నాడు జిల్లాలో టీడీపీ నేతపై కాల్పులు.. పోలీసుల అదుపులో నిందితుడు

Palnadu District
Palnadu District

By

Published : Feb 2, 2023, 6:21 AM IST

Updated : Feb 2, 2023, 12:29 PM IST

06:14 February 02

పల్నాడు జిల్లాలో టీడీపీ నేతపై కాల్పులు.. పోలీసుల అదుపులో నిందితుడు

పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం.. టీడీపీ మండలాధ్యక్షుడికి గాయాలు

Gunfire in Palnadu: ఏపీలోని పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో తూటాపేలింది. రొంపిచర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఆయన ఇంట్లో ఉన్న సమయంలో తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

గతంలో రొంపిచర్ల ఎంపీపీగా వెన్నా బాలకోటిరెడ్డి పని చేశారు. కొద్దిరోజుల క్రితం కూడా బాలకోటిరెడ్డిపైనా ప్రత్యర్థులు దాడి చేశారు. ఆయన వాకింగ్ చేస్తున్న సమయంలో కత్తులతో దాడికి పాల్పడ్డారు. తాజాగా మరోసారి పక్కా ప్లాన్‌తో దాడికి చేశారు. తుపాకీతో కాల్చడంతో 2తూటాలు పొత్తి కడపులోకి దూసుకెళ్లాయి. వెంటనే బాలకోటిరెడ్డిని నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

నరసరావుపేట ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలకోటిరెడ్డిని టీడీపీ నేత అరవిందబాబు పరామర్శించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. బాలకోటిరెడ్డిపై గతంలోనూ హత్యాయత్నం జరిగిందని తెలిపారు. దీంతో ఆయనకు ప్రాణహాని ఉందని ఎస్పీకి గతంలోనే ఫిర్యాదు చేశామని చెప్పారు. కానీ బాలకోటిరెడ్డికి రక్షణ కల్పించటంలో పోలీసులు విఫలం అయ్యారని అరవిందబాబు మండిపడ్డారు. మరోవైపు ఈ ఘటనలో వైసీపీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్న నుదురుపాడుకు చెందిన వెంకటేశ్వర్లుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Last Updated : Feb 2, 2023, 12:29 PM IST

ABOUT THE AUTHOR

...view details