తెలంగాణ

telangana

ETV Bharat / crime

Gun Attack on Priest: ధనవంతుడవ్వాలని పూజ.. ఫలించలేదని పూజారిపైనే తుపాకులతో దాడి..!

"ప్రత్యేక పూజలు చేస్తే.. డబ్బులు వస్తాయో లేదో కానీ.. ఆ పూజలు చేసేందుకు వచ్చిన పూజారిని ట్రాప్​ చేసి బెదిరిస్తే(Gun Attack on Priest).. మాత్రం కాసుల వర్షం తప్పనిసరిగా కరుస్తుంది" అనుకుంది ఆ ముఠా. బెదిరింపులు(Gun Attack on Priest) పెచ్చుమీరితే.. బాధితుని భయమే తమకు ముప్పు అవుతుందని ఊహించలేదు. చివరికి ఆ పూజారి శాపం తగిలి... కటకటాలపాలయ్యారు.

gun-attack-on-priest-gang-arrested-in-hyderabad
gun-attack-on-priest-gang-arrested-in-hyderabad

By

Published : Nov 13, 2021, 10:41 PM IST

Updated : Nov 14, 2021, 6:06 AM IST

ధనవంతుడు కావాలంటే.. కొందరు పూజారులు ప్రత్యేక పూజలు, హోమాలు, యజ్ఞాలు చేయాలని చెబుతుంటారు. అదే పాయింట్​ను పట్టుకుని ఓ ముఠా డబ్బులు సంపాదించాలనుకుంది. కాసుల వర్షం కురిసేందుకు పూజారితో పూజలు చేయించుకోవటమే కాదు.. ఆ పంతులును బెదిరించినా తమకు కావాల్సిన డబ్బులు లాగొచ్చని ఓ క్రిమినల్​ ప్లాన్​ వేశారు. తీరా.. ఆ పథకం​ బెడిసికొట్టి పూజారి ఆగ్రహానికి బలయ్యారు.

పూజతో డబ్బులొస్తాయని..

పూజారిని తుపాకులతో బెదిరించి(Gun Attack on Priest) దోపిడికి పాల్పడిన ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి రెండు తుపాకులు ఏడు చరవాణులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్​ భరత్‌నగర్‌కు చెందిన నాగేశ్వర్‌రావు అనే వ్యక్తి తన నివాసంలో పూజలు చేస్తే ధనవంతుడిని అవుతానని భావించాడు. ఇందుకోసం ఏపీలోని గుంటూరు జిల్లా దుర్గికి చెందిన పురుషోత్తమాచార్యులు అనే పూజారిని సంప్రదించాడు. పూజారి కూడా.. ఈ పూజ వల్ల తనకూ డబ్బులొస్తాయన్న ఆశతో చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ ప్రత్యేక పూజ కోసం పంతులును గత నెల 22న హైదరాబాద్‌కు నాగేశ్వర్​రావు రప్పించాడు.

డబ్బులు రాలేవని బెదిరింపులు..

కూకట్‌పల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పురుషోత్తంతో నాగేశ్వర్‌రావు పూజలు చేయించుకున్నాడు. మరుసటి రోజున కూడా పూజలు చేయించుకున్నాడు. పూజలు పూర్తయినప్పటికీ తనకు డబ్బులు రాలేదని ఆగ్రహం చెందిన నాగేశ్వర్‌రావు అతడి అనుచరుడు రామారావు, పటేల్​తో పాటు మరో ఐదురుగురితో కలిసి పూజారిపై దాడి చేశారు. తుపాకులతో బెదిరించారు. ప్రతిగా... తమకు 3 లక్షలు ఇవ్వాలంటూ పూజారిని బెదిరింపులకు గురి చేశారు. బెదిరింపులతో తీవ్ర ఆందోళనకు గురైన పూజారి పురుషోత్తమాచార్యులు ముఠాకు 45 వేల రూపాయలు రెండు విడతలుగా ఇచ్చాడు.

అత్యాశతో మరోసారి..

ఆ ముఠా అంతటితో ఆగకుండా.. మిగతా డబ్బు కోసం పూజారిని మళ్లీ బెదిరించారు. ఇక్కడే ఆ ముఠా.. అత్యాశతో మరోసారి తప్పులో కాలేసింది. ఇలా కంటిన్యూగా బెదిరిస్తే.. భయపడి మిగిలిన డబ్బు కూడా ఇస్తారనుకున్నారు.. కానీ.. మరింత ఇబ్బంది పెడితే పూజారి పోలీసుల దగ్గరికి వెళ్తాడని.. దొరికిపోతామని ఊహించలేకపోయారు. తనను అకారణంగా బెదిరింపులకు గురి చేస్తున్న ముఠాపై విసుగుచెందిన పూజారి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జరిగిన విషయమంతా వివరించాడు.

బెదిరింపులకు పాల్పడ్డ తుపాకులు

పథకం ప్రకారమేనా..

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ తతంగంలో భాగస్వామ్యులైన మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. విచారణ చేస్తున్నారు. పథకం ప్రకారమే పూజారిని గుంటూరు నుంచి రప్పించి.. నాగేశ్వర్‌రావు అతడి అనుచరులు దోపిడికి పాల్పడ్డారనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇదీ చూడండి:

Last Updated : Nov 14, 2021, 6:06 AM IST

ABOUT THE AUTHOR

...view details