తెలంగాణ

telangana

ETV Bharat / crime

గుజరాత్ యువతుల వసూళ్ల దందా.. వాహనదారులను ఆపి మరీ దబాయింపు..! - గుజరాత్ యువతుల దందా వార్తలు

ఏపీలోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సమీపంలో.. గుజరాత్​కు చెందిన కొందరు యువతులు రోడ్లపై వెళ్లే వాహనాలను ఆపి దందాకు పాల్పడుతున్నారు. వాహనదారులను బలవంతంగా ఆపి నగదు వసూలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.

dandha
dandha

By

Published : Jul 22, 2021, 8:13 PM IST

ఏపీలోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సమీపంలో.. గుజరాత్ రాష్ట్రానికి చెందిన 8 మంది యువతులు.. వసూళ్ల దందాకు తెరతీశారు. ప్రత్తిపాడు మండల పరిషత్ కార్యాలయం సమీపంలో.. గుంటూరు ప్రధాన రహదారిపై వెళ్తున్న వాహనాలను బలవంతంగా ఆపి డబ్బులు వసూళ్లు చేశారు.

గుజరాత్ యువతుల వసూళ్ల దందా.. వాహనదారులను ఆపి మరీ దబాయింపు..!

ప్రతి వాహనదారుడి నుంచి.. కనీసం రు.500 ల పైబడి వసూలు చేసినట్టు.. స్థానిక ఎస్సై అశోక్​కు సమాచారం అందింది. వెంటనే సిబ్బందితో కలిసి ఎస్సై అక్కడికి చేరుకున్నారు. వివరాలు సేకరించారు. ఇలాంటి వసూళ్లు చట్ట విరుద్ధమని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.

ఇదీ చదవండి:Cannabis seize : పైన దానిమ్మ పండ్లు... లోపల భారీగా గంజాయి ప్యాకెట్లు

ABOUT THE AUTHOR

...view details