Groom missing at SR Nagar: రెండ్రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉన్న వరుడు అదృశ్యమయ్యాడు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం బుట్టాయగూడేనికి చెందిన సత్యనారాయణ గుప్తా అలియాస్ నాని(30) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తూ కేపీహెచ్‌బీ కాలనీలో ఉంటున్నాడు. అతనికి ఈనెల 17న వివాహం జరగాల్సి ఉంది. 13న రాత్రి 9.30 గంటలకు తన సోదరుడు ఎస్వీ బాపిరాజుకు ఫోన్ చేసి తాను గ్రామానికి వస్తున్నానని చెప్పాడు.
Groom missing: రెండ్రోజుల్లో పెళ్లి.. వరుడు అదృశ్యం.. అసలేం జరిగిందంటే..? - వరుడు మిసింగ్ కేసు తాజా సమాచారం
Groom missing at SR Nagar: రెండ్రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉన్న వరుడు అదృశ్యమైన ఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ నెల 13న కేపీహెచ్‌బీ కాలనీలో బస్సు ఎక్కిన అతను ఎస్సార్‌నగర్‌లో బస్సు దిగిపోయినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. అతని జాడ కోసం అంతటా గాలించి... ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
![Groom missing: రెండ్రోజుల్లో పెళ్లి.. వరుడు అదృశ్యం.. అసలేం జరిగిందంటే..? Groom missing at SR Nagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13920577-87-13920577-1639634563582.jpg)
Groom missing at SR Nagar
సత్యనారాయణ గుప్తా గ్రామానికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు నగరానికి వచ్చి ఆరా తీశారు. ఈ నెల 13న రాత్రి కేపీహెచ్‌బీ కాలనీలో బస్సు ఎక్కిన అతను ఎస్ఆర్ నగర్లో బస్సు దిగిపోయినట్లు గుర్తించారు. అతని జాడ కోసం అంతటా గాలించి ఆచూకీ లేకపోవడంతో బుధవారం రోజు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఆర్ నగర్ ఠాణా ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపారు.
ఇదీ చదవండి:Online Gaming Cyber Crime: మనవడి ఆటతో తాతకు రూ. 11.5 లక్షలు నష్టం!