బైక్‌పై నుంచి జారిపడ్డ కానిస్టేబుల్.. పైనుంచి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లటంతో మృతి.. - constable died in bus accident
20:37 April 23
బైక్‌పై నుంచి జారిపడ్డ కానిస్టేబుల్.. పైనుంచి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లటంతో మృతి..
హైదరాబాద్‌లోని నందిహిల్స్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడి గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలానికి చెందిన గోపాల్.. సైబరాబాద్ కమిషనరేట్‌లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజూలాగే ఈరోజు కూడా గోపాల్ విధులకు ద్విచక్రవాహనం మీద బయలుదేరాడు. నందిహిల్స్ నుంచి మణికొండ వెళ్తున్న సమయంలో చౌరస్తా వద్ద ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం మీది నుంచి.. గోపాల్ జారి కిందపడ్డాడు.
అదే సమయంలో.. బర్కత్‌పుర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు లింగంపల్లి నుంచి కోఠి వైపు వెళ్తోంది. బైక్‌పై నుంచి రోడ్డుపై పడిపోగా.. పక్కనుంచే వెళ్తున్న బస్సు వెనక చక్రాలు గోపాల్ పైనుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గోపాల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన గచ్చిబౌలిలోని సన్‌షైన్ ఆస్పత్రికి తరలించారు. కానీ.. ఆస్పత్రి చేరేలోపే గోపాల్ తుదిశ్వాస విడిచాడని వైద్యులు నిర్ధరించారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి: