నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. రాకాసిపేటలోని ముస్లిం గ్రేవ్‌యార్డు సెక్యూరిటీగా పనిచేస్తున్న యూసుఫ్‌ఖాన్‌ను దుండగులు హతమార్చారు. సమాచారమందుకున్న పోలీసులు... ఘటనాస్థలికి చేరుకున్నారు.
శ్మశానవాటికలో సెక్యూరిటీ గార్డ్ దారుణ హత్య - nizamabad district news
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని రాకాసిపేటలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వ్యక్తి మెడపై గునపంతో గుచ్చిన ఆనవాళ్లను గుర్తించారు.
రాకాసిపేటలో శ్మశానవాటిక సెక్యూరిటీ గార్డ్ దారుణ హత్య
యూసుఫ్ మెడపై గునపంతో గుచ్చిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంతో పరిసర ప్రాంతాలను పరిశీలించారు. యూసుఫ్ గత నెలరోజులుగా ఇక్కడ సెక్యూరిటీగా గార్డుగా పనిచేస్తున్నట్లు చెప్పారు. హత్యకు సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నామని... త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.