వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం కట్రాలలో గ్రానైట్ లారీ అదుపు తప్పి విద్యుత్ స్తంబాన్ని ఢీకొట్టింది. భారీ శబ్దంతో రోడ్డు పక్కన ఉన్న ఇళ్లపైకి దూసుకెళ్లింది. లారీ రెండు భాగాలు కాగా డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఇళ్లపైకి దూసుకెళ్లిన గ్రానైట్ లారీ.. తప్పిన పెను ప్రమాదం - తెలంగాణ వార్తలు
వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా విద్యుత్ స్తంబాన్ని ఢీకొట్టిన గ్రానైట్ లారీ... పక్కనున్న ఇళ్లపైకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఇళ్లపైకి దూసుకెళ్లిన గ్రానైట్ లారీ.. తప్పిన పెను ప్రమాదం
కరీంనగర్ నుంచి నల్గొండకు గ్రానైట్ చేరవేసి తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఖమ్మం-వరంగల్ రహదారి కావటంతో ప్రతి రోజు ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు వాపోయారు. డ్రైవర్ అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. నిత్యం వందలాది సంఖ్యలో వెళ్తున్న గ్రానైట్ లారీలను నియంత్రించి... ప్రజల ప్రాణాలను కాపాడాలని అధికారులను కోరారు.
ఇదీ చదవండి:లైవ్ వీడియో: వదినను చంపిన మరిది