Grandfather and Grandson Died: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా లచ్చరాయిపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో స్నానానికి దిగి తాతా మనవళ్లు మృతి చెందారు. స్నానానికి వెళ్లినవారు ఇంటికి రాకపోవడంతో స్థానికులు చెరువులో గాలించగా ఇద్దరి మృతదేహాలు లభించాయి. లచ్చరాయిపురం గ్రామానికి చెందిన బోర రాము, బోర గౌతం తాతామనవళ్లు భవాని మాల ధరించారు. తాతా మనవలిద్దరూ కలిసి గ్రామ సమీపంలో ఉన్న చెరువులో స్నానానికి వెళ్లారు. లోతుగా ఉండటంతో స్నానానికి దిగినవారు నీళ్లలో మునిగిపోయారు. స్నానానికి వెళ్లినవారు తిరిగి రాకపోవటంతో తోటి భవాని మలధారులు, స్థానికుల సహాయంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా.. మృతదేహలు లభించాయి.
చెరువులో స్నానానికి దిగి.. తాతా మనవడు మృతి - ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు
Grandfather and Grandson Died: చెరువులో స్నానానికి దిగి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. స్నానానికి అని దిగిన తాతా మనవళ్లు నీళ్లలో మునిగి చనిపోయిన ఘటన ఏపీలోని విజయనగరం జిల్లాలో జరిగింది.
Grandfather and Grandson Died
తాతమనవళ్ల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: