Murder Video: జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కల్వకోటలో దారుణం జరిగింది. మనమడే తాతను రాయితో కొట్టి చంపడం కలకలం రేపింది. గ్రామానికి చెందిన మల్లయ్యపై అందరూ చూస్తుండగానే మనమడు చందు రాయితో అత్యంత పాశవికంగా దాడి చేశాడు. ఇష్టమొచ్చినట్టు కొడుతూ మల్లయ్యను కొద్ది దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. విగతజీవిగా మారిన మల్లయ్యను ఎత్తి.. ద్విచక్రవాహనం ట్యాంక్‌పై పడేసి తీసుకెళ్లాడు. ఈ తతంగాన్ని స్థానికులంతా చుట్టూ మూగి సినిమా చూసినట్టు చూశారు తప్ప.. ఏ ఒక్కరూ ఆపే సాహసం చేయలేదు.
Murder Video: తాతను అత్యంత పాశవికంగా చంపిన మనమడు.. వీడియో వైరల్.. - కల్వకోటలో దారుణం
Murder Video: మనుమడే తాతను అత్యంత పాశవికంగా చంపిన ఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి కల్వకోటలో జరిగింది. ఇష్టమొచ్చినట్టు కొడుతూ.. వీధుల్లో ఈడ్చుకెళ్లటాన్ని స్థానికులు చూస్తూ ఉండిపోయారేే తప్ప ఆపే సాహసం చేయలేదు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.
grand son brutally muder grand father in kalvakota video viral
ఈ అమానవీయ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. హత్యకు పాల్పడిన చందు మానసిక స్థితి సరిగ్గా లేదని.. తరచూ ఇంట్లో ఏదో ఓ గొడవ చేస్తుంటాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఇటీవల ఓ కేసులో అరెస్టు కూడా అయ్యాడని తెలిపారు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటన స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: