తెలంగాణ

telangana

ETV Bharat / crime

అయ్యో పాపం... అడ్డొస్తున్నాడని పసివాడిని అమ్మమ్మే చంపేసింది! - sangareddy district crime news

సొంత మనవడిని హతమార్చిన అమ్మమ్మ
సొంత మనవడిని హతమార్చిన అమ్మమ్మ

By

Published : Jul 30, 2021, 1:31 PM IST

Updated : Jul 30, 2021, 2:18 PM IST

13:28 July 30

సంగారెడ్డిలో సొంత మనవడిని హతమార్చిన అమ్మమ్మ

బుడిబుడి అడుగులేస్తూ.. వచ్చీరాని మాటలతో.. అప్పుడప్పుడే అమ్మా అని పిలిచిన ఆ పిలుపు మూగబోయింది. అమ్మకు అమ్మ.. అమ్మమ్మ చెంత అమ్మను మించిన ప్రేమను పొందిన ఆ పసివాడు.. మృత్యువు కూడా ఆమె రూపంలోనే వస్తుందని ఊహించలేదు. కన్న కూతురిపై ఆమెకున్న ప్రేమ.. ఆ బాలుడి పాలిట శాపమైంది. సరిగ్గా నడవడం కూడా రాని.. ఆ బుజ్జిబాబును కర్కశంగా హతమార్చేలా చేసింది.

రెండో పెళ్లికి అడ్డుగా ఉన్నాడని..

సంగారెడ్డిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సొంత మనవడినే అమ్మమ్మ హతమార్చింది. రెండేళ్ల క్రితం బాలుడు యశ్వంత్ తండ్రి మృతి చెందారు. భర్త చనిపోయిన కుమార్తె.. రెండో పెళ్లి చేయాలని ఆ మహిళ నిర్ణయించింది. ఈ క్రమంలోనే పలు సంబంధాలు వచ్చాయి. కానీ వచ్చినవారంతా బాబును సాకుగా చూపి పెళ్లికి నిరాకరించారు. తన కుమార్తె రెండో పెళ్లికి రెండేళ్ల మనవడే అడ్డుగా ఉన్నాడని భావించిన మహిళ.. మరో వ్యక్తి సాయంతో కర్కశంగా ఆ పసికందును హతమార్చింది. 

చెరువులో మృతదేహం..

గురువారం రోజున సంగారెడ్డిలో యశ్వంత్ అదృశ్యమయ్యాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. శుక్రవారం మధ్యాహ్నం.. బొబ్బిలకుంట చెరువులో ఓ చిన్నారి మృతదేహం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఆ మృతదేహం యశ్వంత్​దేనని నిర్ధారించారు. అనంతరం అతడి తల్లి, అమ్మమ్మను విచారించగా.. అసలు విషయం బయటపడింది. తన కుమార్తె రెండో పెళ్లికి అడ్డుగా ఉన్నాడనే.. మనవడిని హతమార్చినట్లు నిందితురాలు అంగీకరించినట్లు తెలుస్తోంది. 

Last Updated : Jul 30, 2021, 2:18 PM IST

ABOUT THE AUTHOR

...view details