ధాన్యం కొనుగోలు కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగి 33 బస్తాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో జరిగింది. నర్వ గ్రామశివారులో ఉన్న పంటపొలాల్లో వరి కొయ్య కాళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం వల్ల మండలు ఎగిసిపడి సమీపంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చుట్టుముట్టాయని స్థానికులు తెలిపారు.
అగ్నిప్రమాదంలో దగ్ధమైన ధాన్యం బస్తాలు - ధాన్యం బస్తాలు దగ్ధం
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం నర్వ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 33 బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి.
కామారెడ్డి వార్తలు
ప్రమాదంలో గ్రామానికి చెందిన బాలయ్య, నవీన్ గౌడ్‌కు చెందిన తూకం వేసిన ధాన్యం బస్తాలు కాలిపోయాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఇదీ చూడండి:సేంద్రియ సేద్యంతోనే కల్తీలేని ఆహారం: నిరంజన్‌రెడ్డి