Government teacher suicide : వరంగల్ జిల్లాలో మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బదిలీపై మనస్తాపం చెందిన ఉప్పుల రమేష్ అనే ఉపాధ్యాయుడు... విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు. నర్సంపేట మండలం చంద్రయ్యపల్లికి చెందిన రమేష్... ఖానాపురం మండలం ధర్మారావుపేట సమీపంలోని బాలు తండాలో టీచర్‌గా పని చేస్తున్నారు. తాజా బదిలీల్లో ములుగు జిల్లా మల్లంపల్లికి బదిలీ కావడంతో... కుటుంబాన్ని విడిచి వెళ్లలేక... ఆరోగ్యం సహకరించక... సోమవారం నాడు పాఠశాల వద్దే పురుగుమందు తాగారు. నర్సంపేటలోని ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం ఉదయం చనిపోయారు.
Government teacher suicide : ఉద్యోగం బదిలీ.. ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్
11:24 January 25
వరంగల్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య
టీచర్ రమేశ్ మృతితో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.. ఆరోగ్య సహకరించక... లోలోపలే కుమిలిపోయి...ఆత్మహత్య చేసుకున్నాడని రమేష్ కుమారుడు బోరున విలపించాడు.
మాది చందయ్యపల్లి గ్రామం. మా నాన్న వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో పని చేస్తున్నాడు. ఇటీవల జరిగిన బదిలీల్లో ములుగు జిల్లాకు ట్రాన్స్ఫర్ అయింది. అయితే కు జాయినింగ్ ఆర్డర్ తెచ్చుకోవడానికి స్కూల్‌కు పోయారు. సోమవారం పాయిజన్ తాగారు. చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. మా నాన్నకు ఆరోగ్యం సహకరించక... ములుగు జిల్లాకు వెళ్లలేక మనస్తాపం చెందాడు. బదిలీ వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడు.
-రమేశ్ కుమారుడు
ఇదీ చదవండి:Buddha Venkanna Arrest : బుద్దా వెంకన్న అరెస్ట్.. అర్ధరాత్రి విడుదల