శంషాబాద్ విమానాశ్రయంలో రూ.13.6 లక్షల విలువైన బంగారం పట్టివేత - gold seized at hyderabad airport
09:01 April 14
శంషాబాద్ విమానాశ్రయంలో రూ.13.6 లక్షల విలువైన బంగారం పట్టివేత
హైదరాబాద్ శివారులోని శంషాబాద్ విమానాశ్రయంలో 381 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద స్వాధీనం చేసుకున్నారు. సూట్‌కేస్‌లో ప్రత్యేకంగా రూపొందించిన ఫ్రేమ్‌లో పసిడిని గుర్తించారు.
దీని విలువ రూ.13.6 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రయాణికుడిపై బంగారం అక్రమ రవాణా కేసు నమోదు చేశారు.
ఇవీచూడండి:బంగారం అక్రమ రవాణాకు కేరాఫ్ అడ్రస్‌గా శంషాబాద్ ఎయిర్పోర్ట్!