తెలంగాణ

telangana

ETV Bharat / crime

Gold Theft Case: ఆభరణాల చోరీ కేసు ఛేదించిన పోలీసులు.. నమ్మకస్థుడే అసలు దొంగ - Gold Theft case in hyderabad

హైదరాబాద్​లోని పంజాగుట్ట పీఎస్ పరిధిలో జరిగిన బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ముంబయికి చెందిన నగలవ్యాపారి నుంచి రెండు కిలోల బంగారు నగలను దోచేసింది.. ఆయన కింద పనిచేసే ఉద్యోగే అని విచారణలో నిగ్గుతేల్చారు. చోరీకి పాల్పడ్డ ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి కోటి రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

Gold Theft case solved and armaments recovered
Gold Theft case solved and armaments recovered

By

Published : Sep 3, 2021, 7:40 PM IST

ముంబయికి చెందిన నగల వ్యాపారి శ్రవణ్ కుమార్ (రనూజ జువెలర్స్ యజమాని) హైదరాబాద్​తో పాటు.. దేశంలోని పలు నగరాలకు బంగారు ఆభరణాలను సరఫరా చేస్తుంటాడు. శ్రవణ్ కింద ఉద్యోగులుగా పనిచేసే ముకేశ్​, గులాబ్ మాలి ఇద్దరూ ఆగస్టు 23న 3 కిలోల 336 గ్రాముల బంగారు ఆభరణాలను హైదరాబాద్​లోని పలు దుకాణాలకు డెలివరీ ఇచ్చేందుకు ముంబయి నుంచి బస్సులో బయలుదేరారు.

పక్కా పథకంతో..

గోల్డ్ ట్రేడింగ్, విలాసాలకు అలవాటు పడిన గులాబ్ మాలి అనే ఉద్యోగి.. ఈ సరుకుపై కన్నేశాడు. ఇదే అనువైన సమయంగా భావించి.. తన స్నేహితుడు ప్రవీణ్ కుమార్​తో కలిసి పథకం రచించాడు. అనుకున్నదాని ప్రకారం తన స్నేహితుడు ప్రవీణ్ కుమార్​ను ముంబయిలో బస్సెక్కించాడు. 2 కిలోలకుపైగా బంగారం ఉన్న ప్యాకెట్​ను ఇచ్చి పూణెలో దించేశాడు. హైదరాబాద్​లోని అమీర్​పేటకు చేరుకున్న తర్వాత తాను నిద్రలో ఉన్నప్పుడు బంగారం చోరీకి గురైందని యజమానిని, ముకేశ్​తో కలిసి నమ్మించాడు. ఇద్దరూ కలిసి సైఫాబాద్ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయగా.. జీరో ఎఫ్​ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు.. కేసును పంజాగుట్ట పీఎస్​కు బదిలీచేశారు.

ముంబయి టూ రాజస్థాన్​ వయా పూణె...

పంజాగుట్ట ఏసీపీ గణేష్.. ఇద్దరినీ తనదైన శైలిలో విచారించగా.. వారిలో చోరీకి పాల్పడ్డ గులాబ్ మాలి తన తప్పును ఒప్పుకున్నాడు. తన స్నేహితుడు ప్రవీణ్ కుమార్​తో కలిసి ఈ చోరీకి పాల్పడ్డట్లు, చోరీకి గురైన బంగారం రాజస్థాన్​లోని ప్రవీణ్ అతని ఇంట్లో దాచిపెట్టినట్లు సమాచారం అందించాడు. రాజస్థాన్​లోని ప్రవీణ్ ఇంటికి వెళ్లి చోరీకి గురైన 2052.980 గ్రాముల బంగారాన్ని పోలీసులు రికవరీ చేసుకున్నారు. మిగిలిన 69.150 గ్రాముల బంగారాన్ని నిందితుడు ప్రవీణ్ తన ఐసీఐసీఐ బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నాడని.. తక్కిన మొత్తం విలాసాలకు ఖర్చు చేశారని పోలీసులు నిగ్గుతేల్చారు.

పదేళ్లుగా యజమాని శ్రవణ్ కుమార్ దగ్గర నమ్మకంగా పనిచేసిన ఉద్యోగి గులాబ్ మాలీనే ఈ చోరీకి పథక రచన చేశాడని.. వ్యసనాలకు బానిసై ఈ దురాగతానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్టు తెలిపారు.

ఇదీ చూడండి:

viral video: వియ్యంకుల మధ్య గొడవ... వైరల్​గా మారిన దృశ్యాలు

ABOUT THE AUTHOR

...view details