తెలంగాణ

telangana

ETV Bharat / crime

పసిడి అక్రమ రవాణా.. దొరికిపోతున్న దుండగులు - gold seized shamshabad airport

ఫారెన్​ నుంచి వివిధ రుపాల్లో గోల్డ్​ను పలువురు దుండగులు అక్రమంగా రవాణా చేస్తూ అడ్డంగా హైదరాబాద్​ ఎయిర్​పోర్టులో దొరికిపోతున్నారు. లాక్​డౌన్​ తర్వాత ఈ కేసులు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. గత ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు 11.43 కిలోల బంగారం స్వాధీనం కాగా.. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 31 నాటికే 10.55 కిలోల పుత్తడి పట్టుబడినట్లు వెల్లడించారు.

gold smuggling news, shamshabad gold seized news
పసిడి అక్రమ రవాణా.. దొరికిపోతున్న దుండగులు

By

Published : Apr 3, 2021, 8:36 AM IST

విదేశాల నుంచి అక్రమ పద్ధతుల్లో కొందరు ప్రయాణికులు పసిడిని రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత అంతర్జాతీయ విమాన రాకపోకలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇటీవల బంగారం అక్రమ రవాణా కేసులూ ఎక్కువగా నమోదవుతున్నాయి. గత ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు 11.43 కిలోల బంగారం స్వాధీనమవగా.. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 31 నాటికే 10.55 కిలోల పుత్తడి పట్టుబడింది. విదేశాల నుంచి తీసుకువస్తే తక్కువ ధరకే వస్తుందన్న ఆశతో కొందరు ప్రయాణికులు నిబంధనలకు విరుద్దంగా ఇక్కడికి తరలిస్తున్నారు.


వేర్వేరు రూపాల్లో

బంగారం రవాణాకు స్మగ్లర్లు వివిధ పద్ధతులను ఎంచుకుంటున్నారు. వారి నిర్వాకం చూసి కస్టమ్స్‌, డీఆర్‌ఐ, సీఐఎస్‌ఎఫ్‌ అధికారులే నివ్వెరపోతున్నారు. పేస్టులా చేసి లోదుస్తుల్లో దాచుకోవడం, యంత్ర సామగ్రిలోని విడిభాగాలుగా పెట్టడం, జీన్సు ప్యాంటులో నడుము చుట్టూ దాచుకోవడం, నోరు, కడుపు లేదా మూత్రనాళంలోకి ఉంచి తీసుకు వస్తున్నారు. స్మగ్లర్ల నడవడికను పసిగట్టి ప్రత్యేక స్కానర్ల ద్వారా గుర్తించి వారిని అరెస్టు చేస్తున్నారు.


దుబాయి నుంచే అధికం

ప్రస్తుతం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను కొన్ని ఎంపిక చేసిన దేశాలకే నడుపుతున్నారు. వీటిల్లో ఎక్కువగా గల్ఫ్‌దేశాలకే ఉన్నాయి. బంగారాన్ని సైతం దుబాయి, షార్జా, కువైట్‌, ఖతార్‌, సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి రవాణా చేస్తున్నారు. కొందరు ప్రయాణికులు ఏకంగా కిలోల కొద్దీ పసిడిని తీసుకొస్తున్నారు.

అక్రమ మార్గాలు

గల్ఫ్‌ దేశాల్లో బంగారం విలువ తక్కువగా ఉండటంతోపాటు కొనుగోలుపై పరిమితుల్లేవని అధికారులు చెబుతున్నారు. ఆయా దేశాలకు వెళ్లిన ప్రయాణికులు బంగారం కొని కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించకుండా తెస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లి తిరిగొచ్చే భారతీయ ప్రయాణికులు కిలో బంగారం కొనుగోలు చేసి తెచ్చుకోవచ్చు. ఇందుకుగాను 38.5 శాతం కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించాలి. అదే ఏడాదికిపైగా విదేశాల్లో ఉండి స్వస్థలాలకు వచ్చే వారైతే 13.5 శాతం కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సంబంధిత పన్నుల నుంచి తప్పించుకునేందుకే కొందరు ప్రయాణికులు అక్రమ మార్గాల్లో తీసుకువస్తున్నారు.

పలు సంవత్సరాల్లో పట్టుబడిన అక్రమ బంగారం

ఇదీ చూడండి :బెంగళూరులో తీగ లాగితే.. తెలంగాణలో కదిలిన డొంక!

ABOUT THE AUTHOR

...view details