హైదరాబాద్‌లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీ మొత్తంలో బంగారం పట్టుబడింది(gold smuggling in hyderabad airport). కువైట్ ప్రయాణికుడి నుంచి రూ.34.24 లక్షల విలువైన 763.66గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం(gold seized in shamshabad airport) చేసుకున్నారు. ఎయిర్‌పోర్టులో నిర్వహించిన తనిఖీల్లో... బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన వ్యక్తి చాక్లెట్ డబ్బాలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు(gold smuggling in hyderabad airport) తెలిపారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు... అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
gold smuggling in hyderabad airport: చాక్లెట్ డబ్బాలో బంగారం.. భారీ మొత్తంలో సీజ్ - తెలంగాణ వార్తలు
శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో భారీ మొత్తంలో బంగారం(gold smuggling in hyderabad airport) పట్టుబడింది. చాక్లెట్ డబ్బాలో బంగారం ఉంచి... స్మగ్లింగ్ చేస్తుండగా అధికారులు సీజ్ చేశారు. కువైట్ నుంచి వచ్చిన వ్యక్తి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిపారు.
ఇటీవల శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు.. బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. లగేజీని తనిఖీ చేయగా పేస్ట్ రూపంలో బంగారం తెచ్చినట్లు గుర్తించి.. స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.43.55 లక్షలుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
ఇదీ చదవండి:YS VIVEKA MURDER CASE: వివేకా హత్యకేసు విచారణ వేగవంతం.. మున్నాకు నార్కో పరీక్షలు!