తెలంగాణ

telangana

ETV Bharat / crime

విమానాల్లో గోల్డ్ స్మగ్లింగ్.. అక్రమార్కుల బిజినెస్ - బంగారం అక్రమ రవాణా

అధికారులు ఎత్తులను చిత్తు చేస్తూ... బంగారం అక్రమ రవాణాకు అక్రమార్కులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. మూడో కంటికి తెలియకుండా విదేశాల నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. డొమెస్టిక్ ప్రయాణికుల మాటున గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ అక్రమ రవాణాను చూసి అవాక్కవటం అధికారుల వంతు అయింది .

gold smuggling in new way as domestic passengers
gold smuggling in new way as domestic passengers

By

Published : Feb 24, 2021, 8:15 AM IST

బంగారానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిన కూడా ఎక్కువ డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అక్రమార్కులు పెద్ద ఎత్తున విదేశాల నుంచి దక్షిణాది రాష్ట్రాలకు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. ప్రధానంగా గల్ఫ్ దేశాల నుంచి ఈ బంగారం అక్రమ రవాణా ఎక్కువ జరుగుతోంది. కూలీల ద్వారా గల్ఫ్ దేశాల నుంచి పెద్ద మొత్తంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. వివిధ పరికరాలు, వంటింటి సామగ్రి, బెల్టులు, లో దుస్తులు ఇలా వివిధ వాటిల్లో పుత్తడిని స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో విమానాశ్రయాల్లో డీఆర్​ఐ, కస్టమ్స్, సీఐఎస్ఎఫ్ తదితర శాఖల అధికారులు నిఘా పెంచారు. అనుమానం ఉన్న ప్రతి అంతర్జాతీయ ప్రయాణికుడిని తనిఖీలు చేస్తున్నారు.

గల్ఫ్ దేశాలకు ఇక్కడ నుంచే కొందరిని ఇందుకోసమే పంపుతున్నారు. బంగారాన్ని తీసుకుని కొత్తగా ఎంచుకున్న మార్గంలో తిరిగి సురక్షితంగా వస్తున్నారు. అధికారుల ఎత్తులను చిత్తు చేస్తూ.. అక్రమార్కులు కొత్త దారులను ఎంచుకుంటుంటారు. తాజాగా ఎంచుకున్న మార్గం అధికారులను హతుశులను చేస్తోంది. స్మగ్లింగ్ కోసం ప్రత్యేకించి వెళ్లేవారు... పోవడానికి ఎంచుకున్న విమానాశ్రయాన్ని తిరిగి వచ్చేప్పుడు ఎంచుకోరు. అదేవిధంగా బయట దేశాల నుంచి బంగారాన్ని తెచ్చే వ్యక్తి అతను ప్రయాణించిన విమానంలోనే దాచి వస్తాడు. మళ్లీ అదే విమానంలో డొమెస్టిక్ ప్రయాణికుడిగా ఎక్కి బంగారాన్ని తీసుకొచ్చేందుకు అప్పటికప్పుడు టికెట్ తీసుకుని సిద్ధంగా ఉంచుతారు. డొమెస్టిక్ ప్రయాణికుడిలా ఎక్కి బంగారంతో సురక్షితంగా బయట పడతాడు.

ఏదైనా పక్కా సమాచారం ఉంటే తప్ప డొమెస్టిక్ ప్రయాణికులకు విమానాశ్రయాలల్లో అధికారులు నిశితంగా తనిఖీలు చేయరు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అక్రమార్కులు కొత్త మార్క్ స్మగ్లింగ్ ఎంచుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల అధికారులకు ఏలాంటి అనుమానాలు ఉండవని అక్రమార్కులు అంచనా వేస్తున్నారు. సోమవారం రాత్రి పూణే నుంచి హైదరాబాద్ వస్తున్న కర్ణాటకకు చెందిన ప్రయాణికుడిని పక్కా సమాచారంతో శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్​ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.91 లక్షలు విలువ చేసే 1867 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి స్మగ్లింగ్ చేసిన ఆ బంగారాన్ని పూణే వరకు ఇంకో ప్రయాణికుడు తెచ్చాడు. అదే విమానంలో ఎక్కిన మరో వ్యక్తి డొమెస్టిక్ ప్రయాణికుడిలా ఎక్కి హైదరాబాద్​కు​ తెచ్చారని అధికారులు తెలిపారు.

కిలో బంగారం స్మగ్లింగ్ చేస్తే 4 నుంచి 5 లక్షల వరకు లబ్ది చేకూరుతుందని అధికారులు తెలిపారు. ఇందువల్లనే ఆధికారులు అప్పుడప్పుడు బంగారాన్ని పట్టుకున్నా... కేసులు పెట్టినా... లెక్కచేయకుండా తమ అక్రమ కార్యకలాపాలను మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు.

ఇదీ చూడండి: ఇక నుంచి వారంలో ఒకసారి మాత్రమే కేసుల వెల్లడి

ABOUT THE AUTHOR

...view details