Gold seize in shamshabad: వామ్మో.. మలద్వారంలో 7.3 కిలోల బంగారం! - హైదరాబాద్ వార్తలు
21:21 December 10
శంషాబాద్ విమానాశ్రయంలో రూ.3.60కోట్ల విలువైన బంగారం పట్టివేత
Gold seize in shamshabad: విదేశాల నుంచి అడ్డదారిలో అక్రమ బంగారం తరలించడానికి స్మగ్లర్లు ఎత్తుగడలు వేస్తూనే ఉన్నారు. తాజాగా శుక్రవారం నలుగురు విదేశీ ప్రయాణికులు మల ద్వారంలో 7.3 కిలోల బరువు గల బంగారాన్ని తీసుకురావడంతో భద్రతాధికారులు అవాక్కయ్యారు. ఇటీవల భారీ స్థాయిలో బంగారం పట్టుబడటం ఇదే తొలిసారి.
శంషాబాద్ విమానాశ్రయం అధికారులు తెలిపిన కథనం ప్రకారం.. సూడాన్‌కు చెందిన ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్ విమాన సర్వీస్‌లో హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో 7.3 కిలోల బంగారం బిస్కెట్లతో పాటు కరిగించి ముద్ద చేసిన బంగారాన్ని మలద్వారంలో పెట్టుకొని శంషాబాద్‌కు వచ్చారు. నలుగురు సూడాన్ దేశస్థులపై భద్రతా సిబ్బందికి అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని క్షుణ్నంగా పరిశీలించినా బంగారం దొరకలేదు. వైద్యుల సహాయంతో మల ద్వారం వద్ద పరిశీలించగా బంగారం బయట పడింది. రూ.3.6 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి:Gold seize in shamshabad: ఎవరికి దొరకకుండా బంగారాన్ని పేస్ట్‌లాగా చేసి సీటు కింద పెట్టుకొని