శంషాబాద్ విమానాశ్రయంలో దాదాపు అరకిలో విదేశీ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిపై అనుమానంతో అతనితో పాటు లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ప్రయాణికుడి లో దుస్తుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ప్యాకెట్లలో 478.52 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాల విలువ రూ.24.82 లక్షలు ఉంటుందని శంషాబాద్ ఎయిర్‌పోర్టు కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ బాలసుబ్రమణ్యం తెలిపారు. ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.
లో దుస్తుల్లో బంగారం... కస్టమ్స్ అధికారులకు చిక్కిన ప్రయాణికుడు - gold seized in shamshabad airport
శంషాబాద్ విమానాశ్రయంలో దాదాపు అరకిలో బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణీకుడు "లో'' దుస్తుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ప్యాకెట్లలో... బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు.
gold seized in shamshabad airport