అక్రమ బంగారం సరఫరాకు(Gold smuggling in hyderabad airport) శంషాబాద్ విమానాశ్రయం అడ్డాగా మారుతోంది. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా రాష్ట్రంలోకి బంగారం అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో లక్షల రూపాయలు విలువ చేసే బంగారం పట్టుబడింది.
సూట్‌కేస్ హ్యాండిల్లో..
అక్రమంగా బంగారాన్ని దుబాయి నుంచి శంషాబాద్‌కు తీసుకువచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి విమానంలో వచ్చిన ప్రయాణికుడు అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు అతన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా... టాల్‌కమ్ పౌడర్‌లో రూ.20 లక్షలు విలువ చేసే బంగారం ఎవరూ గుర్తించకుండా సూట్‌కేస్ హ్యాండిల్లో ఉంచి తీసుకువచ్చాడు. అతని కదలికలపై అనుమానం వచ్చి తనిఖీలు చేయగా అసలు విషయం బయటపడింది. ఈ మేరకు అధికారులు బంగారం స్వాధీనం చేసుకొని ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి:
Thief Arrest in Hyderabad : హైదరాబాద్‌లో గజదొంగ అరెస్టు.. 180 తులాల బంగారం స్వాధీనం