తెలంగాణ

telangana

ETV Bharat / crime

Gold caught: బస్సులో తరలిస్తుండగా 5 కిలోల బంగారం పట్టివేత

ఏపీలోని కర్నూలు జిల్లాలో భారీ ఎత్తున బంగారం పట్టుబడింది. బెంగళూరుకు చెందిన నగల వ్యాపారి.. ఓ ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సులో 5 కేజీల బంగారంతో ప్రయాణిస్తుండగా పోలీసులు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ. 2కోట్లపైనే ఉంటుందని అంచనా వేశారు.

gold seized in kurnool bus
బస్సులో బంగారం పట్టివేత

By

Published : Jun 24, 2021, 7:25 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద 5 కిలోల బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ బంగారాన్ని ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తుండగా గుర్తించారు. బెంగళూరుకు చెందిన నగల వ్యాపారి మహావీర్.. హైదరాబాద్​ నుంచి బెంగళూరు వెళుతున్న AP 39 TG 8888 నంబరు ప్రైవేట్​ ట్రావెల్స్ బస్సులో 5 కేజీల బంగారంతో ప్రయాణిస్తుండగా పట్టుకున్నారు.

వీటిలో 45 బంగారు బిస్కెట్లు, రెండు నెక్లెస్​లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటికి ఎలాంటి ఈ- వే బిల్లులు చూపకపోవడంతో కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్​కు అప్పగించారు. పట్టుబడిన బంగారు విలువ సుమారు 2 కోట్ల 50 లక్షల రూపాయలు ఉండవచ్చని అంచనా వేశారు.

ఇదీ చదవండి:Balka suman: 'కాషాయ పార్టీ కషాయపు దుష్ప్రచారాన్ని తిప్పి కొడతాం'

ABOUT THE AUTHOR

...view details