జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి దొంగలు పడ్డారు. ఆలయ తలుపులను పగులగొట్టి అమ్మవారి బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.
ఆలయంలో బంగారు ఆభరణాలు, నగదు చోరీ
జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు ఆలయ తలుపులను పగులగొట్టి అమ్మవారి బంగారు ఆభరణాలు, హుండీలో నగదును దోచుకెళ్లారు.
ఆలయంలో బంగారు ఆభరణాలు, నగదు చోరీ
ఆలయంలో ఉన్న హుండీని పగులగొట్టి అందులోని డబ్బులను తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న కోరుట్ల ఎమ్మెల్యే ఆ ఆలయాన్ని సందర్శించారు. దొంగతనం జరిగిన తీరును తెలుసుకున్నారు. ఆలయ పూజారి, ఆలయ కమిటీ వారిని వివరాలు అడిగి పోలీసులకు సమాచారం అందించారు. వేసవి కాలం వచ్చిందంటే దొంగతనాలు ఎక్కువ అవుతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సూచించారు.
ఇదీ చూడండి :విమానాశ్రయంలో 60 లక్షల విలువైన బంగారం సీజ్