మాయమైన 2.30 కిలోల బంగారం లభ్యం - రహదారిపై కారు బోల్తా
10:34 February 24
మాయమైన 2.30 కిలోల బంగారం లభ్యం
పెద్దపల్లి జిల్లా రోడ్డు ప్రమాద ఘటనలో మాయమైన బంగారం లభ్యమైందని పోలీసులు తెలిపారు. నిన్న మల్యాలపల్లి వద్ద బంగారం వ్యాపారుల కారుకు ప్రమాదం జరిగింది. ఇద్దరు వ్యాపారులు మృతి చెందారు. మృతుల వద్ద నిన్న 3 కిలోల 300 వందల గ్రాముల బంగారం లభించిందని పోలీసులు ప్రకటించారు. మరో 2 కిలోల30 గ్రాముల బంగారం మాయమైందని వ్యాపారుల కుటుంబీకుల ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. మధ్యాహ్నం నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతామని వెల్లడించారు.
నిన్న తెల్లవారుజామున మల్యాలపల్లి రైల్వే వంతెన వద్ద కారు బోల్తా పడగా.. ప్రమాదంలో ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ఇద్దరు బంగారు వ్యాపారులు మృతి చెందారు. ప్రమాదం అనంతరం 108 సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి వెళ్లారు. లభ్యమైన బంగారాన్ని పోలీసులకు అప్పగించారు. ఈ మధ్యలో 2 కిలోల 30 గ్రాముల బంగారం మాయమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు.
సంబంధిత కథనం:రహదారిపై కారు బోల్తా.. అన్నదమ్ముల మృతి