తెలంగాణ

telangana

By

Published : Jul 28, 2021, 7:55 PM IST

ETV Bharat / crime

Gold Coins: తవ్వకాల్లో బయటపడ్డ బంగారు నాణాలు.. పంచుకున్న కూలీలు.. తర్వాత?

ఇంటి నిర్మాణం కోసం చేపట్టిన తవ్వకాల్లో బంగారు నాణాలు బయట ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. నాణాలు దొరికన కూలీల్లో పంపకాలలో తేడా వచ్చింది. దీంతో విషయం బయటకు పొక్కి.. పోలీసులకు చేరింది. రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం కూపీ లాగుతున్నారు.

gold coins
బంగారు నాణాలు

జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో బంగారు నాణాలు బయటపడ్డ సంఘటన కలకలం రేపుతోంది. మానవపాడుకు చెందిన జనార్దన్ ఇల్లు నిర్మించాలని నిర్ణయించారు. మంచి రోజు చూసి ముగ్గు పోశారు. మే 5న ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించాడు. నిర్మాణం కోసం 12 కూలీలను మాట్లాడుకున్నారు. ఆ 12 కూలీలు రోజు వస్తూ పనులు చేస్తున్నారు. నెల క్రితం పునాది కోసం కందకం తవ్వినప్పుడు బంగారు నాణాలు దొరికినట్లు స్థానికంగా ఉన్న కొందరు చెబుతున్నారు. మరికొందరేమో వారం క్రితం సంపు కోసం గుంత తవ్వుతుండగా బంగారు నాణాలు దొరికినట్లు చెబుతున్నారు. నాణాలు దొరికిన రోజు తొమ్మిది మందే కూలీకి వచ్చినట్లు.. ఆ ఊరిలో ప్రచారం జరుగుతోంది. ఆ తొమ్మిది మందే నాణాలు పంచుకున్నారని మిగతా ముగ్గురికి బంగారం ఇవ్వకపోవటం వల్లే విషయం బయటకొచ్చినట్లు తెలుస్తోంది.

పంపకాల్లో తేడా రావటంతో విషయం బయటకి వచ్చింది

ఓ రోజు తవ్వకం జరుపుతుండగా ఇద్దరు కూలీలకు బంగారు నాణేలు దొరికాయని. వారు మిగతా ఏడుగురికి ఈ విషయం చెప్పారని. తొమ్మిది మంది నాణాలు సమానంగా పంచుకున్నారని. ఆ రోజు కూలీకి రాని వారు మరుసటి రోజు తమకూ భాగం ఇవ్వాలని కోరారని. దానికి ఈ తొమ్మిది మంది నిరాకరించారని. దీంతో మిగతా ముగ్గురు ఈ విషయాన్ని బయటకు చెప్పారని ఊళ్లో వాళ్లు అనుకుంటున్నారు. నాణేలతో పాటు సుమారు 100కు పైగా 3 వాడ్యానాలు లభ్యమైనట్లు సమాచారం.

విచారిస్తున్న అధికారులు

తహసీల్దార్, ఎస్సై విచారణ

ఈ ఘటనపై తహసీల్దార్ వరలక్ష్మి, ఎస్సై సంతోష్ ఇంటి వద్దకు వెళ్లి యజమాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఇంటి పనులకు వెళ్లే వారిని స్టేషన్​కు పిలిపించి విచారణ జరిపినట్లు సమాచారం. నాణాలు దొరికిన విషయం మొదట్లో తన దృష్టికి రాలేదని ఇంటి యజమాని తెలిపారు. పంపకాలు చేసుకున్న తర్వాత తేడా రావటంతో కూలీల్లోని కొందరు తనకు చెప్పినట్లు పేర్కొన్నారు. బంగారు నాణేలతో పాటు వాడ్యానాలు కూడా లభ్యమైనట్లు ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలు అధికారుల విచారణలో తెలియాల్సి ఉంది. దర్యాప్తు అనంతరం రేపు లేదా ఎల్లుండి మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:WOMAN MURDER: కిల్లర్ దంపతులు.. అడ్డా మీద మహిళా కూలీలపైనే గురి!

Ganja smuggling: చేపల లారీల్లో... రూ.7.30 కోట్ల విలువైన గంజాయి

ABOUT THE AUTHOR

...view details