హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి రెండున్నర తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగులు లాక్కెళ్లారు. ఘటనకు సంబంధించి వెంటనే బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకుంటామని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు గొలుసు లాక్కొని... జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపుకు వెళ్లినట్లుగా కెమెరాల్లో నిక్షిప్తమైంది.
మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లిన దుండగులు - హైదరాబాద్ తాజా వార్తలు
ఓ మహిళ మెడలోంచి రెండున్నర తులాల బంగారు గొలుసును దుండగులు లాక్కెళ్లిన ఘటన... హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మహిళ మెడలో బంగారు గొలుసు అపహరణ
ఇదీ చదవండి: 'తెరాస టికెట్ ఇవ్వకపోతే చనిపోతాను'