తెలంగాణ

telangana

ETV Bharat / crime

GOLD CAUGHT: పోలీసుల తనిఖీల్లో 1.2 కిలోల బంగారం పట్టివేత

ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోనిలో చేపట్టిన తనిఖీల్లో భాగంగా పోలీసులు(POLICE SEARCHES) రసీదులు లేని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఓ నగల వ్యాపారిని వారు అదుపులోకి తీసుకున్నారు.

GOLD CAUGHT
బంగారం పట్టివేత

By

Published : Jul 1, 2021, 8:50 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని షరఫ్ బజారులో సోదాలు చేపట్టారు. బిల్లులు లేని.. 1 కిలో 200 గ్రాముల బంగారాన్ని స్వాధీనం(GOLD CAUGHT) చేసుకున్నారు. దీనికి సంబంధించి నరసరావుపేటకు చెందిన నగల వ్యాపారి రామకృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ఎలాంటి రసీదులు లేకుండా.. వారి వద్ద అక్రమంగా ఉన్న బంగారం విలువ రూ. 70 లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. ఎలాంటి ఈ- వే బిల్లులు చూపనందున.. పట్టుబడిన బంగారాన్ని వాణిజ్య పన్నుల శాఖ అధికారికి అప్పగించనున్నట్లు ఒకటో పట్టణ సీఐ చంద్రశేఖర్ వెల్లడించారు.

ఇదీ చదవండి:దుమారం రేపుతున్న మంత్రి వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details