హెచ్ఎండబ్ల్యూఎస్కు పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత(Accident) పడ్డారు. వివరాల్లోకి వెళితే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని హెచ్‌ఎండబ్ల్యూఎస్‌లో ఆ ఇద్దరు పని చేస్తున్నారు. రాజ్ కుమార్ టాటా ఏసి ట్రాలీ డ్రైవర్‌గా, అర్జున్ వెల్డర్‌గా పని చేస్తున్నారు. వారు పని ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో వెనుకనుంచి గ్లాండ్ ఫార్మా పరిశ్రమకు పని చేస్తున్న… శ్రీసాయి గణేష్ ట్రావెల్స్ వాహనం వచ్చి బలంగా ఢీ(Accident)కొట్టింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు.
Accident: ఆ కంపెనీకి పనిచేస్తున్న వాహనం ఢీ.. ఇద్దరు స్పాట్ డెడ్ - గ్లాండ్ ఫార్మా పరిశ్రమ వాహనం
రోజు మాదిరిగా పని చేసుకుని ఇంటికి వెళుతున్న ఇద్దరు కార్మికులను... గ్లాండ్ ఫార్మా పరిశ్రమకు పని చేస్తున్న శ్రీసాయి గణేష్ ట్రావెల్స్ వాహనం ఢీ(Accident) కొట్టింది. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జాతీయ రహదారిపై జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాజ్ కుమార్ బీహార్‌కు చెందిన వ్యక్తి కాగా, అర్జున్ ఒడిశాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాలను పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారిద్దరూ కూడా స్థానిక కూకట్‌పల్లిలో ఉంటున్నారు. బస్సు పటాన్చెరు నుంచి రామచంద్రపురం వైపు వెళుతుండగా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ముందు ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. డ్రైవర్ బాగా మద్యం సేవించి ఉన్నట్లు సమాచారం.
ఇదీ చూడండి:suspension: మృతుని భార్యతో వివాహేతర సంబంధం.. ఎస్ఐ సస్పెన్షన్!