విద్యార్థినుల మధ్య ఘర్షణ.. శానిటైజర్ తాగి ఐదుగురి ఆత్మహత్యాయత్నం - Students who drank the sanitizer
10:54 November 20
విద్యార్థినుల మధ్య ఘర్షణ.. శానిటైజర్ తాగి ఐదుగురి ఆత్మహత్యాయత్నం
girls drink sanitizer in hanumakonda: విద్యార్థుల మధ్య ఏర్పడిన చిన్న ఘర్షణ చివరకు ఆత్మహత్యకు దారి తీసిన ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. హనుమకొండలోని ఆరెపల్లి కస్తూర్భా గాంధీ బీసీ వసతి గృహంలో పదో తరగతి చదువుతున్న కొందరు విద్యార్థులు ఘర్షణకు దిగారు. దీంతో అందులో ఐదుగురు విద్యార్థినులు మనస్తాపానికి గురై హాస్టల్లో ఉన్న శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తోటి విద్యార్థులు గమనించి హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. హాస్టల్ సిబ్బంది వచ్చి వారిని హుటాహుటిన వరంగల్లోని ఎంజీఏం ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు వైద్యం అందిస్తోన్న వైద్య సిబ్బంది వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఘటనపై విచారణ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: