తెలంగాణ

telangana

ETV Bharat / crime

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి నిరాహార దీక్ష - Girlfriend worried that boyfriend refused to marry

ప్రేమిస్తున్నాని వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. యువతి పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే ముఖం చాటేశాడు ఆ యువకుడు. ఇక విసుగు చెందిన ఆ యువతి ప్రియుడి ఇంటి ముందు నిరాహార దీక్షకు దిగింది. ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రంలో జరిగింది.

Girlfriend worried that boyfriend refused to marry
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ఆందోళన

By

Published : Apr 1, 2021, 4:30 PM IST

ప్రేమించి పెళ్లికి నిరాకరించిన ప్రియుడి ఇంటి ముందు.. ఓ యువతి ఆరు రోజులుగా నిరాహార దీక్ష చేస్తోంది. ములుగు జిల్లా బండారుపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి, జిల్లా కేంద్రానికి చెందిన బారుపాటి సాయి సూర్యవర్మ అనే యువకుడు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా అతడు నిరాకరించాడు.

ఈ విషయమై పంచాయితీ జరిగింది. సఖీ సెంటర్​లో కౌన్సిలింగ్ జరిగినా అతని ప్రవర్తనలో మార్పురాలేదు. విసుగు చెందిన యువతి ప్రజాసంఘాల నేతలతో కలిసి సూర్యా ఇంటి ముందు నిరాహార దీక్షకు దిగింది. ప్రియుడితో పెళ్లి జరిపించేంత వరకు దీక్ష కొనసాగిస్తానని తేల్చి చెప్పింది.

ఇదీ చదవండి:భార్యను వ్యభిచారం చేయాలని భర్త ఒత్తిడి.. అరెస్ట్ చేసిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details