తెలంగాణ

telangana

ETV Bharat / crime

LIVE VIDEO: ప్రేయసి రాలేదని ప్రియుడు బలవన్మరణం.. హత్యేనని అనుమానం.! - ప్రియురాలు రాలేదని ప్రియుడు మృతి

కాసేపైనా ప్రేయసి ఎడబాటు భరించలేని ఓ ప్రేమికుడు.. అర్ధరాత్రవుతున్నా సరే ఆమె ఇంటికి పరుగున వెళ్లాడు. వెళ్లిన కొద్ది నిమిషాల తర్వాత ఏమైందో తెలీదు.. అకస్మాత్తుగా అతను భవనం పై నుంచి కిందపడ్డాడు. ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఇదిలా ఉంటే అసలు ఆ కొద్ది నిమిషాల సమయంలో అక్కడ ఏం జరిగిందనేది తెలియదు. యువతిని బయటకు రమ్మంటే రానన్నందుకు అతను భవనం పై నుంచి దూకాడని యువతి తల్లిదండ్రులు చెబుతుంటే.. మరో వైపు కావాలనే తమ కుమారుడిని చంపేశారని యువకుడి కుటుంబీకులు చెబుతున్నారు. హైదరాబాద్​ బాలానగర్​లో జరిగిన ఈ ఘటనలో దాగున్న కోణాలేంటి?

Boyfriend forced death at balanagar, hyderabad crime news
ప్రియురాలు రాలేదని ప్రియుడు బలవన్మరణం

By

Published : Jun 21, 2021, 1:25 PM IST

Updated : Jun 21, 2021, 5:41 PM IST

అర్ధరాత్రి సమయంలో ప్రియురాలి కోసం ఆమె ఇంటికి వెళ్లిన ప్రేమికుడు.. వెళ్లిన కాసేపటికే విగత జీవిగా మారాడు. ఈ ఘటన హైదరాబాద్​ బాలానగర్​లో చోటుచేసుకుంది. జగద్గిరిగుట్ట నెహ్రూ నగర్​కు చెందిన శుభం(26)కు ఇన్​స్టా​గ్రామ్​లో బాలానగర్ శోభనాకాలనీకి చెందిన ఓ యువతి(22)పరిచయమైంది. యువతితో గత కొంతకాలంగా ఆ యువకుడు సన్నిహితంగా ఉంటున్నాడు.

మద్యం మత్తులో

ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో మద్యం మత్తులో ఉన్న యువకుడు ప్రియురాలి ఇంటి వద్దకు వెళ్లాడు. తనను బయటకు రమ్మని వాదించగా తాను రానని యువతి తేల్చిచెప్పింది. యువతిని తనతో బయటకు పంపాలని ఆమె తల్లిదండ్రులతోనూ వాగ్వాదానికి దిగాడు. తనతో రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. అయినా వారి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.

భవనం పై నుంచి కింద పడిన శుభమ్​

దీంతో మనస్తాపానికి గురైన ప్రియుడు.. వెంటనే అదే భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు యువకుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఇది హత్యే..

యువకుడి కుటుంబీకుల ఆందోళన

ఇదిలా ఉండగా ఘటనపై శుభం తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఆటోలో ఆస్పత్రికి ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. యువతి కుటుంబీకులే తమ కుమారుడిని చంపేశారని ఆరోపించారు. ఇంతకీ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక.. యువతి తల్లిదండ్రులే చంపేశారా అనే విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

ఇదీ చూడండి:drugs seized: శంషాబాద్ విమానాశ్రయంలో రూ.20 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

Last Updated : Jun 21, 2021, 5:41 PM IST

ABOUT THE AUTHOR

...view details