తెలంగాణ

telangana

ETV Bharat / crime

ప్రియుడి వేధింపులు తాళలేక ప్రియురాలి బలవన్మరణం - మహబూబాబాద్​ జిల్లా తాజా వార్తలు

ప్రియుడే వేధింపులకు గురి చేస్తుండటంతో మనస్తాపం చెందిన ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మహబూబాబాద్​ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ప్రియురాలి ఆత్మహత్య
ప్రియురాలి ఆత్మహత్య

By

Published : May 10, 2021, 8:44 AM IST

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సాంబ తండాలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన ప్రియుడే వేధింపులకు గురిచేస్తుండటంతో మనస్తాపానికి గురైన ప్రియురాలు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

తండాకు చెందిన సునీత అనే యువ‌తి అదే తండాకు చెందిన శివ అనే యువకుడు ప్రేమించుకున్నారు. గత కొంతకాలంగా శివ.. సునీతను వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన సునీత ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది.

మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ బంధువులు బయ్యారం పోలీస్ స్టేషన్ ఎదుట రాస్తారోకో చేపట్టారు. ఏఎస్పీ యోగేశ్​ గౌతమ్​ ఘటనా స్థలానికి చేరుకొని.. విచారణ జరిపి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి.. గుర్తు తెలియని మహిళపై దుండగుల హత్యాచారం

ABOUT THE AUTHOR

...view details