‘నాన్న నిత్యం మద్యం తాగొచ్చి అమ్మతో గొడవపడుతున్నాడని, కుటుంబ సభ్యులందర్నీ కొడుతున్నాడని’ పేర్కొంటూ ఓ బాలిక(12) సోమవారం జగిత్యాల పట్టణ పోలీసులను ఆశ్రయించింది. నేరుగా స్టేషన్‌కు వచ్చిన బాలిక.. ఎస్‌ఐ నవత ఎదుట తన బాధను వెళ్లగక్కింది. ప్రతిరోజూ ఇంట్లో జరుగుతున్న గొడవలు, వాటివల్ల తనతోసహా కుటుంబ సభ్యులు మానసికంగా ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ కన్నీటిపర్యంతమైంది.
MINOR GIRL COMPLAINT: 'మా నాన్న తాగొస్తున్నాడు.. అందర్ని కొడుతున్నాడు' - తెలంగాణ వార్తలు
పిల్లలకు తల్లిదండ్రులు రోల్మాడల్గా ఉండాలి. తండ్రి అయితే తన బాధ్యతను సరిగా నిర్వహించాలి. లేకుంటే పిల్లలపై ప్రభావం పడుతుంది. ఎదుగుతున్న వయసులో ఇంట్లో జరిగే ప్రతి సంఘటన మైనర్లపై ప్రభావం చూపుతుంది. కొన్ని సార్లు వారి భవిష్యత్తును కూడా దెబ్బతీసే అవకాశం లేకపోలేదు. అయితే ఇక్కడే ఓ బాలిక ఆలోచించిన తీరు ప్రశంసనీయం. ఇంటి గుట్టు బయటపెడితే పరువు పోతుంది అనుకోకుండా.. పడుతున్న బాధను పోలీసుల ముందు వెల్లబోసుకుంది. సమస్యలను వివరిస్తూ కన్నీటిపర్యంతమైంది. ఇంతకీ ఆ బాలికకు వచ్చిన కష్టం ఏంటో చూడండి.
బాలిక
స్పందించిన ఎస్‌ఐ బాలిక ఇంటికి వెళ్లి, ఆమె తండ్రికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇకనైనా మారాలని హితవు పలికారు. ఇకపై ఎప్పుడు సమస్య పునరావృతమైనా డయల్ 100కు సమాచారమిస్తే తానొస్తానని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
Last Updated : Aug 3, 2021, 8:12 AM IST